‘ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు’.. రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

by Disha Web Desk 19 |
‘ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు’.. రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ ట్విట్టర్ వేదికగా తెలిపారు. గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారు.. అని పేర్కొన్నారు. మీ కష్టం, మీ శ్రమ వృధా కాలేదు.. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిది.. అంటూ అందరికీ అభినందనలు తెలిపారు.

Next Story