- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొసలి కన్నీరు కారుస్తున్నారు.. బూత్ స్థాయి సన్నాహక సమావేశంలో టీపీసీసీ చీఫ్ విమర్శలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మొసలి కన్నీరు కారుస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) విమర్శించారు. ఈ మేరకు ఆయన గురువారం జూబ్లీహిల్స్ పరిధిలోని రహ్మత్ నగర్‌లో బూత్ స్థాయి సన్నాహక సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ శకం ముగిసిందని, జూబ్లీ హిల్స్ సీటు కాంగ్రెస్ ఖాతాలో పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయం మేరకే ఉప ఎన్నిక అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఎంపిక జరిగిందన్నారు. కేటీఆర్ మీ పదేళ్ల విధ్వంస పాలనను ప్రజలు మర్చిపోలేదన్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎప్పుడైనా ఊహించారా..? 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం ఇస్తారని అనుకున్నారా..? అని ప్రశ్నించారు. ప్రజల కష్ట కాలంలో తోడుగా ఉండే నాయకుడు కావాలని నవీన్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించారని అన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది, ప్రజలకు కావాల్సింది సెంటిమెంట్ కాదు అభివృద్ధి అని టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. డ్రగ్స్ కల్చర్ తీసుకొచ్చింది కేటీఆర్ కాదా? అని ప్రశ్నించారు. యువత చెడు వ్యసనాలకు బారిన పడిన విషయం మర్చిపోలేదు కేటీఆర్.. అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మాటకు కట్టుబడి ఉండే పార్టీ అని, జూబ్లీహిల్స్ అన్ని రకాలుగా అభివ్రుది చెందాలంటే నవీన్ యాదవ్ గెలవాల్సిన అవశ్యకత ఉందన్నారు. మహిళ సెంట్రిక్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం.. నవీన్ యాదవ్‌ను భారీ మెజారిటీ తో గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. జూబ్లీ హిల్స్ సీటు గెలవడం ఖాయమని, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, మాజీ ఎంపీ అజారుద్దీన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.






