- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈటల రాజేందర్ రెడ్డి ఏ కులానికి చెందిన వ్యక్తి? మహేష్ కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు
ఎంపీ ఈటల రాజేందర్ రెడ్డి ఏ కులానికి చెందిన వ్యక్తి? రెడ్డి కులమా? ముదిరాజ్ కులమా? క్లారిటీ ఇవ్వాలని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఎంపీ ఈటల రాజేందర్ రెడ్డి (MP Eatala Rajender) ఏ కులానికి చెందిన వ్యక్తి? రెడ్డి కులమా? ముదిరాజ్ కులమా? క్లారిటీ ఇవ్వాలని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) ప్రశ్నించారు. ఆయనది ఏ కులమో ఆయనకు క్లారిటీ లేదన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. (CM Revanth Reddy) సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని ఎంపీ ఈటలకి మాస్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ ప్రెసిడెంట్ పదవి దక్కలేదన్న అక్రోశంలో ఈటల రాజేందర్ అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల ఉన్నప్పుడు తెలంగాణ ఆర్థికంగా దివాలా తీసిందని ఆరోపించారు.
హైడ్రా (Hydra) గురించి మాట్లాడే ఈటల దేవాదాయశాఖ భూములను కబ్జా చేశారని కేసు ఉన్న విషయం మర్చిపోయారా? అని నిలదీశారు. బీసీ బిడ్డవై (KCR) కేసీఆర్‌కి అడుగులకు మడుగులు వత్తిన విషయం మరిచావా అంటూ గుర్తుకు చేశారు. కేసీఆర్ హయంలో చేతకాని, దద్దమ్మ మంత్రులుగా ఉన్న మీరు సీఎం రేవంత్ గురుంచి మాట్లాడే నైతిక అర్హత లేదని తీవ్ర విమర్శలు చేశారు. 60 వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ పడిపోతుందా? అని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ దివాలా తీయడానికి.. కారణమైన కేసీఆర్ అలీబాబా చోరిస్‌లో ఈటల ఒకరు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
విద్య, వైద్య పరంగా తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. ఆర్థిక మాంద్యం ప్రపంచ వ్యాప్తంగా ఉందని, ఆర్థిక మాంద్యాన్ని అధిగమించి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలిపారు. బీజేపీ నేతలు ఈటల, బండి సంజయ్ ఏమి మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ నేతలు అడుగడుగునా అడ్డు పడుతున్నారని, బీసీ బిడ్డగా ఈటల, (Bandi Sanjay) బండి సంజయ్‌ను ఎవరు అంగీకరించని పరిస్థితిలో లేరని చెప్పారు. బీసీ బిల్లు విషయంలో బీజేపీ నేతల వైఖరిని బీసీ సమాజం క్షమించే పరిస్థితి లేదని అన్నారు. తప్పులు ఎత్తి చూపండి.. సద్వి విమర్శ చేయండి.. అంతేగాని స్వార్థంతో నోటికొచ్చింది మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.






