- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్నూరు కాపులపై కాంగ్రెస్‌కు అనుబంధం ఎనలేనిది.. టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపు బిడ్డలను పీసీసీ స్థాయికి చేర్చిందని, మున్నూరు కాపులపై కాంగ్రెస్‌కు అనుబంధం ఎనలేనిదని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపు బిడ్డలను పీసీసీ స్థాయికి చేర్చిందని, మున్నూరు కాపులపై కాంగ్రెస్‌కు అనుబంధం ఎనలేనిదని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ధర్మపురి సంజయ్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్, గడుగు గంగాధర్, ఆకుల లలితతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. మా గురువు శ్రీనివాస్‌ని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
రాజకీయ ఓనమాలు నేర్పిన వ్యక్తి, ఎలక్షన్లో ఓడినప్పుడూ నాకు బాసటగా నిలిచారని తెలిపారు. నేను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని నా గురువు స్వర్గీయ శ్రీనివాస్ ఓ జర్నలిస్టుతో మాట్లాడుతూ నమ్మకం వ్యక్తం చేసిన మాటలు నన్ను మరింత బాధ్యతతో నడిపిస్తున్నాయన్నారు. నిన్న ప్రకటించిన డీసీసీ కమిటీల్లో 16 మంది బీసీ నేతలకు చోటు కల్పించడం మా ప్రభుత్వ బీసీ సంకల్పానికి నిదర్శనమని చెప్పారు. శ్రీనివాస్‌ని గుర్తుకు తెచ్చారనీ ఖమ్మం నుండి ఒక నాయకుడు ఫోన్ చేసి అభినందించారని అన్నారు. కులాభిమానం తప్పు కాదు, కానీ కుల పిచ్చి ఉండకూడదన్నారు. బీసీలు 56 శాతం ఉన్నారనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దని సూచించారు. బీసీల అభ్యున్నతికి సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి పనిచేస్తున్నారన్నారు. బీసీలు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధిని ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
READ MORE ....
దాతృత్వం చాటుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. సొంతూరికి భారీ విరాళం






