TPCC: నాపై అర్బన్ నక్సలైట్ ముద్ర వేశారు.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ హాట్ కామెంట్స్

by Ramesh Naini |

నా పై అర్బన్ నక్సలైట్, దేశ ద్రోహి ముద్ర వేశారని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు.

TPCC: నాపై అర్బన్ నక్సలైట్ ముద్ర వేశారు.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆపరేషన్ కగార్‌కి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన మరుసటి రోజు నుంచి నా పై అర్బన్ నక్సలైట్, దేశ ద్రోహి ముద్ర వేశారని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC chief Mahesh Kumar Goud) అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం సీపీఐ మఖ్దూమ్ కార్యాలయం రీ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలుగు నేలపై జన్మించిన మఖ్దూమ్ జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని, మఖ్దూమ్‌కి సింగరేణి కార్మికులతో ఎనలేని బంధం ఉందని కొనియాడారు. మొదట మఖ్దూమ్ కార్యాలయం ఫౌండేషన్ స్టోన్ కి ( ఫిబ్రవరి 17, 1974) అప్పటి కాంగ్రెస్ మంత్రులు హాజరయ్యారని గుర్తుకు చేశారు. (Congress) కాంగ్రెస్, (Communist) కమ్యూనిస్టుల అనుబంధం విడదీయరానిదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టులు బలపడాలని కోరుకున్న వ్యక్తుల్లో మొదటివాడిని, కమ్యూనిస్టు భావజాలానికి ఎప్పుడు మరణం లేదు. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కొదవలేదని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో జట్టుకట్టి విజయం సాధించామన్నారు. దేశంలో లౌకికవాదం గురించి మాట్లాడితే (urban Naxal) అర్బన్ నక్సల్స్ అవుతున్నాం. ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడితే దేశద్రోహులం అవుతున్నామని మండిపడ్డారు. ఆపరేషన్ కగార్‌తో కేంద్రం మారణకాండ కొనసాగిస్తోందని, ఇది బాధాకరం అని అన్నారు. మావోయిస్టులు చర్చకు సిద్ధమని ప్రకటించిన మానవత్వం కనికరము లేకుండా సీజ్ ఫైర్ చర్యకు పూనుకున్నారని ఆరోపించారు. (Operation Kagar) ఆపరేషన్ కగార్ పేరుతో అటవీ ఖనిజ సంపదను కార్పొరేట్స్‌కి దోచిపెట్టే ప్రయత్నం కేంద్రం చేస్తోందని ఆరోపించారు. దేశం భవిష్యత్ కోసం లౌకిక వాద శక్తులు బలపడాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశంలో ఎలక్షన్ కమిషన్ కొందరు వ్యక్తులకు లాభం చేసే సంస్థగా మారడం దౌర్భాగ్యం.. ఈ పరిణామం శ్రేయస్కరం కాదు.. అని ఆరోపణలు చేశారు.

Next Story