- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీహార్‌లో దొడ్డు బియ్యం తప్ప సంక్షేమం లేదు: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు
మచ్చలేని వ్యక్తి, మార్గదర్శి సల్మాన్ ఖుర్షీద్ అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కొనియాడారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మచ్చలేని వ్యక్తి, మార్గదర్శి సల్మాన్ ఖుర్షీద్ అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) కొనియాడారు. ఆదివారం చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర (Rajiv Gandhi Sadbhavana Yatra) సంస్మరణ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. 1990, అక్టోబర్ 9 దేశ ఐక్యత కోసం చార్మినార్ నుంచి సికింద్రాబాద్ వరకు సద్భావన యాత్ర చేశారని గుర్తుకు చేశారు. ఈ యాత్రను పురస్కరించుకుని ప్రతి ఏటా సద్భావన కమిటీ అవార్డు అందజేస్తున్నారని, ఈ ఏడాది గొప్ప వ్యక్తి (Salman Khurshid) సల్మాన్ ఖుర్షీద్‌కు ఇవ్వడం శుభ పరిణామం అని అన్నారు. రాజీవ్ గాంధీ ఆలోచనల కోసం రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గత పదేళ్లుగా ఎన్నడూ లేని విధంగా ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమం నడుస్తోందన్నారు. (Bihar) బీహార్‌లో పది కిలోల దొడ్డు బియ్యం తప్ప మరే సంక్షేమం లేదని విమర్శించారు. తెలంగాణలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన నడుస్తోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు. కాగా, అంతకు ముందు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని స్థానిక నాయకులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీలు కొప్పుల ప్రవీణ్ కుమార్, అల్లం భాస్కర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.






