ఆంధ్రా ప్రాజెక్టులు కట్టుకున్నా మనకు సమస్య లేదు.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

హరీశ్‌రావు వాదనలలో పస లేదని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు.

ఆంధ్రా ప్రాజెక్టులు కట్టుకున్నా మనకు సమస్య లేదు.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: హరీశ్‌రావు (Harish Rao) వాదనలలో పస లేదని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) హాట్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలో నిన్న నీటి పారుదల అంశాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు, నీటి పారుదల శాఖ మంత్రులు, అధికారుల సమావేశంలో ఏ అంశాలపై ఏమి మాట్లాడారో స్వయంగా కేంద్ర మంత్రి సీ.ఆర్ పాటిల్ చెప్పిన కూడా హరీశ్‌రావు పిచ్చి వాగుడు వాగుతూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మీటింగ్ లో ఏ ఏ అంశాలు, ఏమి మాట్లాడారో స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కూడా హరీశ్‌రావు మెదడు కు ఎక్కనట్టు ఉందని ఫైర్ అయ్యారు.

హరీశ్‌రావు ఆరు అడుగులు పెరిగాడే తప్ప ఆర అంగుళం మెదడు పెంచుకోలేదు.. అడ్డగోలు వాదన అర్థం లేని తర్కంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. సీఎం మాట్లాడగానే ఏదో ఒకటి మాట్లాడి తన ఉనికిని చాటు కోవాలన్న తపన తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు సవాల్ విసిరారు.. అసెంబ్లీ వచ్చి చర్చల్లో పాల్గొనండి లేదా మేమే ఫామ్ హౌస్ కు వచ్చి అక్కడ మాక్ అసెంబ్లీ పెడుతాము మీరు పాల్గొనండి అని సవాల్ చేస్తే అక్కడ నుంచి నోరు లేవలేదు.. మీరు మళ్లీ సిగ్గులేకుండా సవాళ్ల గురించి మాట్లాడుట్జున్నారని విమర్శించారు. గోదావరిలో 3 వేల టీఎంసీల నీటి వరద ఉంది.. ఆంధ్రా ప్రాజెక్టులు కట్టుకున్నా మనకు సమస్య లేదని స్పష్టం చేశారు. రాయలసీమను రతనాల సీమ చేస్తాను.. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని కేసీఆర్ అంటేనే ఈ రోజు వాళ్ళు బనకచర్ల (Banakacharla), రాయలసీమ ఎత్తిపోతల పథకాలు కడుతున్నదని వివరించారు.

తెలంగాణ కు అడ్డగోలుగా ద్రోహం చేసినా మీరే మళ్లీ సిగ్గులేకుండా కాంగ్రెస్ మీద, సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. మీకు దమ్ముంటే అసెంబ్లీలో పెట్టే చర్చలకు నువ్వు, మీ మామ కేసీఆర్ లు వచ్చి మీ వాదన చెప్పండి.. అప్పుడు ఎవరు ఏంటో తెలుస్తాది. ప్రెస్‌మీట్‌లు పెట్టి కోడిగుడ్డు మీద ఈ కలు పీకుదామని చూస్తే జనం నమ్మరు.. అని మహేశ్ కుమార్ గౌడ్ కీలక కామెంట్స్ చేశారు.

Next Story