- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్‌ల నియామకం.. టీపీసీసీ చీఫ్ ప్రకటన.. వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశాలు
పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంచార్జ్‌లకు సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (Appointment of in-charges of joint districts) పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంచార్జ్‌లకు సూచించారు. సొమవారం ఉమ్మడి జిల్లాల వారీగా ఇంచార్జ్‌లను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar) నియమించారు. ఈ మేరకు నియమించిన 10 మంది ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్‌లతో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంచార్జ్‌ల విధి విధానాలను మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) ప్రకటించారు. త్వరలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నిర్మాణం చేపట్టాలని, ఈ నేపథ్యంలోనే వెంటనే రంగంలోకి దిగాలని ఏఐసీసీ ఇంచార్జి ఆదేశించారు. కాగా, ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను టీపీసీసీ నియమించిన విషయం తెలిసిందే.
ఇక జిల్లాల వారీగా ఇంచార్జ్‌లు..
1. సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీ చంద్ రెడ్డిని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్‌గా నియమించారు. 2. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, నల్గొండ 3. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వరంగల్ 4. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మెదక్ 5. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, హైదరాబాద్ 6. పీఏసీ సభ్యుడు కుసుమ కుమార్, మహబూబ్ నగర్ 7. ఎంపీ అనిల్ యాదవ్ ఆదిలాబాద్ 8. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కరీంనగర్ 9. వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మత్ హుస్సేన్, నిజామాబాద్ 10. ఎస్ఏటీ చైర్మన్ శివసేన రెడ్డికి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్‌గా నియమించారు.






