మల్లు రవిపై ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిస్తాం.. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

ఉమ్మడి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా కాంగ్రెస్‌(Congress)లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

మల్లు రవిపై ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిస్తాం.. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా కాంగ్రెస్‌(Congress)లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. క్షమశిక్షణ కమిటీ చైర్మన్‌గా కొన‌సాగుతున్న‌ నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి (Mallu Ravi)పై మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ (Sampath Kumar) ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ (Meenakshi Natarajan)కు కంప్లైంట్ చేశారు. పార్టీ లైన్ క్రాస్ చేసి బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే విజేయుడితో కలిసి ఎంపీ తిరుగుతున్నాడని సంప‌త్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా మల్లు రవిపై ఇచ్చిన ఫిర్యాదులపై టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ స్పందించారు. మల్లు రవిపై ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతంపై సమీక్ష సమావేశాలు నిర్వహించాలని కేడర్‌కు సూచించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఎక్కడా ఇవ్వడం లేదని చెప్పారు. కులగణన విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.

Next Story