- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ ఎన్నికలకు పలు కమిటీలను ప్రకటించిన టీపీసీసీ
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా టీపీసీసీ మీడియా కమిటీని నియమించింది. ఈ మేరకు పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆమోద ముద్రతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కమిటీ జాబితాను శనివారం విడుదల చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా టీపీసీసీ మీడియా కమిటీని నియమించింది. ఈ మేరకు పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆమోద ముద్రతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కమిటీ జాబితాను శనివారం విడుదల చేశారు. కమిటీ చైర్మన్ గా సామ రామ్మోహన్ రెడ్డి నియమితులు కాగా సభ్యులుగా 14 మందిని నియమించారు. వీరిలో లింగం యాదవ్, రవిచంద్ర, రమ్యారావు, ఇందిరాశోభన్, జక్కని అనిత, హైమావతి, పాలడుగు పద్మ, జగదీష్ నేత, గౌస్, కల్పనా రెడ్డి, మంజులా రెడ్డి, అహ్మద్ నాసిర్, జల్పల్లి నరేందర్, నరేష్ రాథోడ్‌లు ఉన్నారు.
వీరు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో మీడియా వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ వ్యవహారాలను మానిటరింగ్ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయ చైర్మన్‌గా 14 మందితో కూడిన కమిటీని టీపీసీసీ చీఫ్ నియమించారు. ఈ కమిటీలో కన్వీనర్లుగా సునీతా ముదిరాజ్, శివ చరణ్ రెడ్డి, యడవల్లి వెంకట స్వామి, మిద్దెల జితేందర్, సదాలక్ష్మి, జువ్వాది ఇందిరా రావు, ప్రియాంక కమేల్, దుర్గం భాస్కర్, బిజ్జి శత్రురావు, ఈస్తర్ రాణి, మాచ వరలక్ష్మి, మహ్మాద్ ఇర్ఫాన్ అలీ, పతి కుమార్, కోట్య నాయక్ లు ఉన్నారు.






