- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పర్యాటక శాఖ స్వయం సంవృద్ధి సాధించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు
ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న ప్రజా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పని చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న ప్రజా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పని చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. హిమయత్ నగర్ లోని పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయంలో పర్యాటక ప్రగతిపై మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, టీజీటీడీసీ మేనెజింగ్ డెరెక్టర్ వల్లూరు క్రాంతి, ఇతర అధికారులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా పర్యాటక ప్రాజెక్ట్ ల పనుల స్థితిగతులు, బడ్జెట్ హోటల్స్, ఇతర పెండింగ్ పనులు, మొదటి దశలో కొత్తగా చేపట్టబోయే ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి గురించి అధికారులు మంత్రికి వివరించారు.
సమీక్షలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. టూరిజం డెస్టినేషన్ సెంటర్ తీర్చిదిద్దాలి. ఇప్పటికే ప్రభుత్వం నూతన పర్యాటక విధానాన్ని తీసుకువచ్చింది. పర్యాటక రంగం ద్వారా ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పన, సాంస్కృతిక మార్పిడిని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలి. పీపీపీ విధానంలో 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలి. దశల వారీగా ప్రాధన్యత క్రమంలో వీటిని అభివృద్ధి చేయాలి. నిర్వీర్యమైన ఆస్తుల నుంచి ఆదాయం సృష్టించాలి.
ప్రైవేట్ హోటల్స్, ట్రావెల్స్ కు ధీటుగా ఆదాయం పెంచుకోవాలి. పర్యాటక శాఖ స్వయం సంవృద్ధి సాధించాలని అధికారులకు మంత్రి దిశానిర్ధేశం చేశారు. బోనాలు, బతుకమ్మ, సమ్మక్క -సారాలమ్మ జాతర, నాగోబా జాతరలను ఘనంగా నిర్వహించి, దేశీయ అంతర్జాతీయ పర్యాటకులను ఇక్కడికే రప్పించేలా కృషి చేయాలి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రియో కార్నివాల్ తరహాలో.. తెలంగాణలో అంతర్జాతీయ కార్నివాల్ నిర్వహణకు ప్రతిపాదనలు ప్రణాళికలు రూపొందించాలన్నారు.
బ్రాండింగ్, ప్రమోషన్ పై ఫోకస్ చేయాలి
వాటర్ స్పోర్ట్స్ లో సాహస క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలని, అవసరమేతై ఇతర రాష్ట్రాలకు వెళ్లి దీనిపై అధ్యయనం చేయాలని సూచించారు. తెలంగాణలోని ప్రధాన జాతీయ రహదారుల్లో వే సైడ్ అమ్నిటీస్ కల్పనకు చర్యలు తీసుకోవాలని, సైనేజ్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో షార్ట్ సే కోసం గ్లాపింగ్ టెంట్స్, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. పర్యాటక ప్రాంతాలపై ప్రచారం కల్పించాలని, బ్రాండింగ్, ప్రమోషన్ పై ఫోకస్ చేయాలని, సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవాలని చెప్పారు.
తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేలా పర్యాటక ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి, కళాకారులకు ఉపాధి లభించేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. అధికారులు రిజల్ట్ ఓరియటెండ్ గా పని చేసి.. ఫలితాలు సాధించాలని, నిర్ధిష్ట కాలపరిమితిలో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పైల్స్ పెండింగ్ లో పెట్టడానికి వీలు లేదని, పెండింగ్ లో ఉన్న పైళ్లతోపాటు కొత్తగా వచ్చే వాటిని కూడా కంప్యూటరీకరణ చేయాలని అన్నారు.






