టూరిజం కాంక్లేవ్-2025: తెలంగాణకు రూ.15 వేల కోట్ల పెట్టుబడులు.. 30 ప్రాజెక్టులు, 19 వేలకు పైగా ఉద్యోగావకాశాలు

by Ramesh Naini |

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో తెలంగాణ టూరిజం కాంక్లేవ్ - 2025 కార్యక్రమం నిర్వహించారు.

టూరిజం కాంక్లేవ్-2025: తెలంగాణకు రూ.15 వేల కోట్ల పెట్టుబడులు.. 30 ప్రాజెక్టులు, 19 వేలకు పైగా ఉద్యోగావకాశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో (Telangana Tourism Conclave 2025) తెలంగాణ టూరిజం కాంక్లేవ్ - 2025 కార్యక్రమం నిర్వహించారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే.. టూరిజం కాంక్లేవ్-2025 కార్యక్రమంలో తెలంగాణకు రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో రూ.15,279 వేల కోట్ల పెట్టుబడులకు పలు సంస్థలు ఎంవోయూలు చేశాయి. మొత్తం 30 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. వీటిలో పీపీపీ విధానంలో 14 ప్రాజెక్టులు (రూ.7,081 కోట్లు), 16 ప్రైవేటు రంగ ప్రాజెక్టులు (రూ. 8,198 కోట్లు) వచ్చాయి.

ఈ పెట్టుబడులతో తెలంగాణలో 19,520 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. అనంతగిరిలో లగ్జరీ వెల్నెస్ రిట్రీట్, వికారాబాద్‌లో తాజ్ సఫారీ, విన్యార్డ్ రిసార్ట్, 3 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లకు ఒప్పందం జరిగింది. మొదటిసారిగా హైదరాబాద్‌కు ఇంటర్ కాంటినెంటల్, సెయింట్ రీజిస్, ఒబెరాయ్ హోటల్స్ రానున్నాయి. ఫిలిం, టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్స్ అభివృద్ధితో తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్‌గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీర్చిదిద్దనుంది.

Next Story