- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chhattisgarh Encounter: మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ లో అగ్రనేత మృతి
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత మృతి చెందారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దండకారణ్యంలో వరుస ఎదురు కాల్పుల్లో మావోస్టులకు (Maoists) భారీ ఎదురు దెబ్బ తగులుతోంది. తాజాగా ఈ ఉదయం ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో (Chhattisgarh Encounter) మృతుల సంఖ్య 17కు పెరిగింది. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత జగదీశ్ (Jagadish) మృతి చెందారు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్న జగదీశ్ ఇవాళ జరిగిన కాల్పుల్లో మరణించినట్లు ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ వెల్లడించారు. ఆయన తలపై రూ. రూ.25 లక్షల రివార్డు ఉందన్నారు. జగదీశ్ ఛత్తీస్‌గఢ్‌లోని జీరామ్ లోయలో 2013న 30 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను హత్య చేసి మారణహోమం సృష్టించిన కేసులో, 2023లో 10 మంది జవాన్లు, ఓ డ్రైవర్ మృతి చెందిన దంతేవాడ పేలుడులో సూత్రధారిగా ఉన్నారని చెప్పారు.
నక్సలిజం అంతంపై తగ్గేదెలే : అమిత్ షా
సుక్మాలో ఇవాళ జరిగిన ఆపరేషన్‌లో తమ భద్రతా సంస్థలు 17 మంది నక్సలైట్లను మట్టుబెట్టాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) తెలిపారు. వారి వద్ద నుంచి భారీగా ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇది నక్సలిజంపై నాలుగో అతి పెద్ద స్ట్రోక్ అని, మోడీ నాయకత్వంలో 2026 మార్చి 31 లోపు నక్సలిజాన్ని నిర్మూలించాలని నిర్ణయించుకున్నట్లు మరోసారి ప్రకటించిరారు. ఆయుధాలు కలిగి ఉన్నవారికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఆయుధాలు, హింసతో మార్పు తీసుకురాలేరని, అభివృద్ధి మాత్రమే సాధ్యమవుతుందన్నారు.






