- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bade Chokka Rao: నక్సలైట్ కమాండర్ బడే చొక్కారావు జిందా హై..
మావోయిస్టు నేత బడే చొక్కారావు ఎన్ కౌంటర్ పై మావోయిస్ట్ పార్టీ కీలక ప్రకటన చేసింది.

దిశ, భద్రాచలం/ డైనమిక్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్ దక్షిణ బస్తర్ కాంకేర్, మారేడుబాక అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కమాండర్ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు (Bade Chokkarao) మరణించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ (Maoist Party) ఖండించింది. బడే చొక్కారావు మరణించలేదని మావోయిస్టు పార్టీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ప్రతినిధి సమత (Samatha) తాజాగా ప్రకటన విడుదల చేశారు. బడే చొక్కారావు మరణించినట్లు మావోయిస్టుల పేరుతో పోలీసులే నకిలీ ప్రెస్ నోట్లు జారీ చేశారని ఆమె ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌లో (Chhattisgarh Encounter) చనిపోయిన ఎనమిది మందిలో నలుగురు మావోయిస్టులు, నలుగురు గ్రామస్తులు ఉన్నారని పేర్కొన్నారు. ప్రజల్లో అయోమయం భ్రమలు కలిగించేందుకే పోలీసులు ఈ బూటకపు ప్రకటనలు ఇస్తున్నారని, బడే చొక్కారావు, ఇతర సహచరులు క్షేమంగా ఉన్నారని తెలిపారు. కాగా, ఇటీవలే బడే చొక్కారావు తాను క్షేమంగా ఉన్నట్లు సహచరులకు ఫోన్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.






