విద్యార్థులకు అలర్ట్.. రేపు పాఠశాలలకు హాలిడే ?

by velandi.Saikiran |   (  Updated:2025-04-03 17:29:21  IST  )

తెలంగాణ రాష్ట్రంలో ( Telangana)... రేపు విద్యాసంస్థలకు ( educational institutions) హాలిడే ( Holiday) ఉంటుందని జోరుగా

విద్యార్థులకు అలర్ట్.. రేపు పాఠశాలలకు హాలిడే ?
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ( Telangana)... రేపు విద్యాసంస్థలకు ( educational institutions) హాలిడే ( Holiday) ఉంటుందని జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. గురువారం సాయంత్రం నుంచి.. హైదరాబాద్ తో ( Hyderabad) పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. జోరుగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో రేపు ఉదయం కూడా భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ( Department of Meteorology ) హెచ్చరికలు జారీ చేస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో... హైదరాబాద్ తో పాటు వర్ష ప్రభావిత జిల్లాలలో... శుక్రవారం రోజున పాఠశాలలకు హాలిడే ఇవ్వాలని కొంత మంది డిమాండ్ చేస్తున్నారు.

అలాగే రేపు కచ్చితం గా హాలిడే ఉంటుందని కూడా సోషల్ మీడియా లో మరి కొంత మంది ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు తెలంగాణ విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వర్షాలు పడితే కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హాలిడే ప్రకటిస్తుందన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు దీనిపై ఇంకా స్పందించలేదు తెలంగాణ ప్రభుత్వం. ఇది ఇలా ఉండగా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అలాగే ఎల్లుండి కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో మాత్రం... వరుసగా రెండు రోజుల పాటు కుండపోత వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప... బయటకు రాకూడదని కూడా అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఇక గురువారం రోజున కురిసిన వర్షానికి... హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.

Next Story