TG: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు విద్యాసంస్థలకు సెలవు

by Prasad Jukanti |

తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

TG: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు విద్యాసంస్థలకు సెలవు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా 166 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు రేపు పోలింగ్ (Telangana Municipal Elections) జరగనుంది. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. ఇక పోలింగ్ రోజున ఆయా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‍ల పరిధిలో ఉన్న స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించాలని (School Holiday) ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దీంతో పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు సెలవు ప్రకటించారు. అలాగే రేపు జరిగే పోలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు సైతం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

పోలింగ్ స్టేషన్లకు చేరిన బ్యాలెట్ బాక్సులు

రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సామగ్రి అంతా పోలింగ్ స్టేషన్లకు చేరుకుంది. ఇవాళ ఉదయం నుంచి జిల్లాల్లో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల నుంచి సిబ్బంది సామగ్రి తీసుకుని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రేపు ఉదంయ 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలతో ముగియనుంది.

Next Story