Tollywood: 'నువ్వు నా పెళ్లానివి'.. అమ్మాయిని మోసం చేసిన టాలీవుడ్ బడా నిర్మాత!.. ఉమెన్ కమిషన్ చైర్ పర్సన్ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-10-03 14:43:57  IST  )

టాలీవుడ్ లో మహిళలపై జరుగుతున్న వేధింపులపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tollywood: నువ్వు నా పెళ్లానివి.. అమ్మాయిని మోసం చేసిన టాలీవుడ్ బడా నిర్మాత!.. ఉమెన్ కమిషన్ చైర్ పర్సన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద (Nerella Sharada) పరిచయం అక్కర్లేని పేరు. ఈ బాధ్యతలు చేపట్టాక వివిధ వసతి హాస్టల్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ అక్కడ అమ్మాయిల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వారి బాధలు విని సిబ్బందిని అక్కడే కడిగిపారేసే వీడియోలు సోషల్ మీడియాలో తరచూ చూస్తుంటారు. అలాంటి నేరెళ్ల శారద తాజాగా సినిమా ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న వేధింపుల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అమ్మాయిలను చీట్ చేస్తున్నారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు కీలక విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో వేధింపులకు సంబంధించి కొన్ని కేసులు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నాయని కానీ మీడియా ముందుకు రాని కేసులు కూడా చాలానే ఉంటున్నాయన్నారు. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అమ్మాయిలను చీట్ చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు.

బడా నిర్మాత మోసం:

టాలీవుడ్ కు (Tollywood) చెందిన చాలా పెద్ద పేరు కలిగిన ఓ నిర్మాత (producers cheating) భార్య పిల్లలు ఉన్నప్పటికీ నువ్వే నా పెళ్లానికి అంటూ మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వారితో పిల్లలను కని మోసం చేశాడని నేరెళ్ల శారద ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన పేరు ఇక్కడ చెప్పకూడదు. కానీ ఆయన చాలా పెద్ద నిర్మాత. ఈ మధ్యనే ఆయన మూవీ ఒకటి చాలా పెద్ద హిట్ అయింది. ఆయన బాధితురాలు తమ వద్దకు న్యాయం కోసం వచ్చారు. దాంతో నిందితుడిని పిలిపించడానికి కమిషన్ నోటీసులు సిద్ధం చేసింది. కానీ అనూహ్యంగా బాధితురాలు వెనుకడుగు వేశారని చెప్పుకొచ్చారు. ఇలా చాలా సందర్భాల్లో సమస్య రాగానే తమ వద్దకు బాధితులు రావడం ఆ తర్వాత మేము కేసు రిజిస్టర్ చేసుకుని సమయం ఇచ్చాక వెనుకడుగు వేయడం జరుగుతోందన్నారు. మా వద్దకు వచ్చే వారి బాధలు వింటాం. కానీ ఆ తర్వాత సినిమా రంగానికి సంబంధించిన పెద్దలు పిలుచుకుని మాట్లాడుతారా లేక భయపెడతారా? మరేదైనా ఒప్పందం కుదుర్చుతారా? ఏం జరుగుతుందో తెలియదు. కానీ బాధితులు మళ్లీ కమిషన్ ముందుకు రావడం లేదన్నారు. ఇలా రెండు లేదా మూడు సిట్టింగ్‍లు జరిగాక బాధితులు వెనకడుగు వేస్తున్నారని చెప్పారు.

ఇండస్ట్రీ ఆలోచన మారాలి:

ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం, ప్రొఫెషన్‍లా భావించి ఇండస్ట్రీకి వచ్చిన మహిళలను అడ్వాంటేజ్‍గా తీసుకోవడం సరికాదని ఈ సందర్భంగా శారద అన్నారు. మహిళలపై వేధింపుల విషయంలో ఇండస్ట్రీని అంతా పిలిచి కొన్ని రూల్స్ పెట్టుకుందామా అనుకుంటే ఇండస్ట్రీ వారు తాము ప్రత్యేక గ్రహానికి చెందిన వారమని భావిస్తున్నారని, తామంతా గ్రహంతర వాసులమనే ఆలోచనతో ఉన్నారని చెప్పుకొచ్చారు. తమ వద్దకు ఇతరులు రావొద్దంటూ ఒక కవచంలో ఇండస్ట్రీ ఉన్నంత వరకు సామాన్య కుటుంబానికి చెందిన వారు తమ పిల్లలను ఇండస్ట్రీకి పంపాలంటే జంకుతూనే ఉంటారన్నారు. ఇండస్ట్రీలో మంచివారు లేరు అని నేను అనడం లేదు. కానీ తల్లిదండ్రుల తమ పిల్లలను ఇతర ప్రొఫెషన్స్ లోకి ఎలా ధైర్యంగా పంపించగలుగుతున్నారో సినిమా ఇండస్ట్రీకి వెళ్తామంటే కూటా అంతే ధైర్యంతో పంపించే పరిస్థితులు రావాలన్నారు.

Next Story