Toll Exemption: మేడారం భక్తులకు టోల్ మినహాయింపు!.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-01-03 12:55:56  IST  )

సంక్రాంతికి టోల్ ఫీజుపై కేంద్రానికి లేఖ రాసిన కోమటిరెడ్డి తాజాగా మేడారం జాతకు వెళ్లే వాహనాలకు టోల్ మినహాయింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Toll Exemption:  మేడారం భక్తులకు టోల్ మినహాయింపు!.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు టోల్ ఫీజు అంశం చర్చనీయాంశంగా మారింది. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ విజయవాడ హైవే మీద టోల్ ఫీజు రద్దు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం పట్ల తెలంగాణ వాదుల వైపు నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‍లో వైపు వెళ్లే వాహనాలక కోసం టోల్ చార్జీల మినహాయింపు కోరిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల విషయంలో ఎందుకు అలాంటి ఆలోచన చేయడం లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడారంజాతరకు (Medaram Jatara) వెళ్లే భక్తులకు కూడా టోల్ ఫీజు విషయంలో మినహాయింపును పరిశీలిస్తున్నామని అన్నారు. టోల్ ప్లాజాలు కేంద్రం ఆధీనంలో ఉన్నాయని అందువల్ల సంక్రాంతికి టోల్ ఫీజుపై గడ్కరీకి లేఖ రాశామన్నారు. సోషల్ మీడియాలో ప్రచారాలను పట్టించుకోనన్నారు. శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈఏడాది మేడారం మహాజాతర2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.


Next Story