నేటి తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా.. అసలు కారణం ఇదే

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-25 04:58:44  IST  )

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది.

నేటి తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా.. అసలు కారణం ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు సీఎంవో (CMO) అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు. నేడు జరగాల్సిన సమావేశం సోమవారం (జూలై 28) మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ఢిల్లీ (Delhi)లో పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉండగా.. ఏఐసీసీ (AICC) సమావేశంలో పాల్గొనేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడే ఉండిపోయారు. దీంతో ఐదుగురు మంత్రులు ఢిల్లీలోనే ఉండటంతో నేటి కేబినెట్ సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Next Story