- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు హరీశ్‌రావు కాళేశ్వరం విచారణ వాయిదా.. అసలు విషయం ఇదే!
మరోసారి విచారణకు రావాలంటూ జస్టిస్ పీ చంద్రఘోష్ (Justice P Chandraghosh) నేతృత్వంలోనే కాళేశ్వరం కమిషన్ హరీశ్ రావు (Harish Rao)కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మరోసారి విచారణకు రావాలంటూ జస్టిస్ పీ చంద్రఘోష్ (Justice P Chandraghosh) నేతృత్వంలోనే కాళేశ్వరం కమిషన్ హరీశ్ రావు (Harish Rao)కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ ఆయన ఉదయం సరిగ్గా 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా తాను ఇవాళ విచారణకు హాజరుకావడం లేదని కమిషన్‌కు హరీశ్ రావు సమాచారం అందజేశారు. అయితే, బీఆర్ఎస్ అధినేత, మాజీ మంత్రి కేసీఆర్ వైద్య పరీక్షల నిమిత్తం ఇవాళ సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి వెళ్లనుండటంతో మరో రోజున విచారణకు హాజరవుతానని జస్టిస్ పీ చంద్రఘోష్‌కు సమాచారం అందజేశారు.
కాగా, గత విచారణలో భాగంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ (Kaleshwaram Lift Irrigation) పరిధిలోన ఉన్న అన్ని ప్రాజెక్టుకు కేబినెట్ అనుమతులు ఉన్నాయని హరీష్‌రావు స్టేట్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, గతంలో ఇచ్చిన వాంగ్మూలం, ప్రభుత్వం అందించిన కేబినెట్ నోట్స్ మధ్య వ్యత్యాసాన్ని గుర్తించిన జస్టిస్ పీ చంద్రఘోష్ ఇవాళ మరోసారి హరీశ్ రావును విచారణకు రావాలని కోరినట్లుగా తెలుస్తోంది.






