- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు రాహుల్ గాంధీ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ (Congress) అగ్రనేత, లోకసభా పక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) జన్మదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పెషల్ విషెస్ చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ (Congress) అగ్రనేత, లోకసభా పక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) జన్మదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పెషల్ విషెస్ చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. భారతదేశ ఆశాకిరణానికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ కామెంట్ చేశారు. మా నాయకుడు, నిశ్శబ్ద బలం యొక్క స్వరూపం, నిజమైన దార్శనికుడు, దయామయుడు, జ్ఞానవంతుడు, ప్రజల ఆసక్తులను హృదయంలో ఉంచుకున్న వారే రాహుల్ గాంధీ అని అన్నారు. భారతదేశం కోసం పోరాడే సైనికుడు, ఈ దేశాన్ని నిజంగా ప్రేమించే వారందరికీ స్ఫూర్తి.. అన్నింటి కంటే తాను కలిసిన అత్యుత్తమ మానవులలో ఒకరు, ప్రతిపక్ష నాయకుడు తమ అధినేత అని కొనియాడారు. ఆయన దేశ ప్రజల పట్ల చూపే ప్రేమను ప్రపంచం గుర్తించాలని, ఆయన నిజమైన నిబద్ధతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని ఆకాంక్షించారు.






