- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కనుమ ఎఫెక్ట్.. వెయ్యి దాటిన కేజీ చికెన్ రేటు.. మటన్ ధర ఎంతంటే?
by Ajay Maddhiboyina |
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. నేడు కనుమ పండుగ కావడంతో నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్ సెంటర్ల ముందు బారులు తీరారు.

X
దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. నేడు కనుమ పండుగ కావడంతో నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్ సెంటర్ల ముందు బారులు తీరారు. ఉదయం నుండే షాపుల ముందు క్యూ కట్టారు. ఇక నేడు డిమాండ్ ఉండటంతో హైదరాబాద్‌లో నాన్ వెజ్ ప్రియులకు షాక్ ఇచ్చేలా ధరలు కనిపిస్తున్నాయి. సాధారణ రోజల కంటే వ్యాపారులు చికెన్, మటన్ ధరలను భారీగా పెంచేశారు. నేడు హైదరాబాద్‌లో కేజీ మటన్ ధర రూ.1050 ఉంటే బాయిలర్ చికెన్ ధర రూ.350గా ఉంది. ఇక నాటు కోడి చికెన్ ధర సైతం వెయ్యికి పైగానే పలుకుతోంది. ఇక సాధారణ సమయాల్లో చికెన్ కేజీ రూ.280 నుండి రూ.300 ఉంటే మటన్ కేజీ ధర రూ.800 నుండి రూ.850 వరకు మాత్రమే ఉండేది. దీంతో పండుగపూట ధరలు భారీగా పెంచడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Next Story






