డిజిటల్ గవర్నెన్స్ తెలంగాణ టాప్ : టీకే శ్రీదేవి

by velandi.Saikiran |

డిసెంబర్ 2025లో కేంద్ర ప్రభుత్వ పథకమైన స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కాపిటల్ ఇన్వెస్ట్ మెంట్(సాస్కీ)-2025-26 ప్రత

డిజిటల్ గవర్నెన్స్ తెలంగాణ టాప్ : టీకే శ్రీదేవి
X

డిసెంబర్ లోగా కేంద్రానికి సాస్కీ ప్రతిపాదనలు

నోడల్ ఎజెన్సీగా డీటీసీపీ

స్టేక్ హోల్డర్లతో ఎన్ఐయూఎం, సీడీఎంఏ సమావేశం

సంస్కరణల అమలులో తెలంగాణ ముందంజ : ఎంహెచ్ యూఏ

డిజిటల్ గవర్నెన్స్ తెలంగాణ టాప్ : టీకే శ్రీదేవి

దిశ, తెలంగాణ బ్యూరో: డిసెంబర్ 2025లో కేంద్ర ప్రభుత్వ పథకమైన స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కాపిటల్ ఇన్వెస్ట్ మెంట్(సాస్కీ)-2025-26 ప్రతిపాదనలను పంపించాల్సి ఉంది. తెలంగాణ పురపాలక, పట్టణాభివ్రుద్ది శాఖలోని సాస్కీ భాగస్వాములుగా ఉన్న అన్ని విభాగాలకు సంబంధించిన ప్రతిపాదనలను క్రోడికరించి కేంద్రప్రభుత్వానికి పంపించేందుకు నోడల్ ఎజెన్సీగా డీటీసీపీకి బాధ్యతలు అప్పగించారు. అయితే కేంద్రప్రభుత్వానికి పంపించే ప్రతిపాదనల గురించి బుధవారం తాజ్ దక్కన్ లో పురపాలకశాఖ కార్యదర్శి టీకే.శ్రీదేవి అధ్యక్షతన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్ మెంట్(ఎన్ఐయూఎం), పురపాలకశాఖ సంయుక్తంగా నిర్వహించిన వర్క్ షాపులో చర్చించారు.


ఈ సందర్బంగా కేంద్రగృహనిర్మాణంమరియుపట్టణవ్యవహారాలమంత్రిత్వశాఖలోని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆర్గనైజేషన్ అడిషనల్ చీఫ్ ప్లానర్ మహ్మద్ మోనీస్ ఖాన్, టీసీపీ సుదీప్ రాయ్, కన్సల్టెంట్ కిషోర్ అవాడ్ మాట్లాడుతూ సంస్కరణలను అమలు చేయడంలో తెలంగాణ ముందంజలో ఉందని ప్రశంసించారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే ‘బిల్డ్ నౌ’ వంటి నూతన ఆవిష్కరణలను అమలు చేశారని గుర్తుచచేశారు. జీఐఎస్ ఆధారిత ఆస్తుల మ్యాపింగ్, సమగ్ర ప్రాపర్టీ ట్యాక్స్ నిర్వహణ, టౌన్ ప్లానింగ్ విధానాల అమలు, వాతావరణ అనుకూల మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపై విధివిధానాలను సంమగ్రంగా వివరించారు. ఈ సందర్బగా టీకే శ్రీదేవి మాట్లాడుతూ జాతీయ మార్గదర్శకాలను రాష్ట్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకోవాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ రాష్ట్రం డిజిటల్ గవర్నెన్స్ అమలు, పట్టణ ఆవిష్కరణల్లో తీసుకున్న చర్యలను వివరించారు. ల్యాండ్ పూలింగ్, గ్రీన్‌ఫీల్డ్ ప్రణాళికా దృక్పథాలు వంటి ముందస్తు శ్రేణిలో తీసుకున్నచర్యలను పేర్కొన్నారు.

నోడల్ ఎజెన్సీగా డీటీసీపీ…

సాస్కీ విధివిధానాలను వివరించడానికి కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన వర్క్ షాపులో పురపాలక, పట్టణాభివ్రుద్ది శాఖ పరిధిలోని హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక , జలమండలి ఈడీ మాయంక మిట్టల్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ , గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చయత్బజపాయ్ , కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ , రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ , డీటీసీపీ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి , జీహెచ్ఎంసీ సీసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ విభాగాలన్నింటిలో నోడల్ ఎజెన్సీగా డీటీసీపీని నిర్ణయించారు. డీటీసీపీ డైరెక్టర్ నోడల్ ఆఫీసర్ వ్యవహరించనున్నారు. అయితే సాస్కీ కింద రాష్ట్రానికి 2023-24లో రూ.400కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 2025-26లో రూ.2051కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు పంపించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సందేహాలను చర్చించడానికి అన్ని విభాగాలతో సమావేశం నిర్వహించారు.

Next Story