- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోరాటం చేద్దాం.. చనిపోవద్దు : ఈశ్వర్ పార్థివ దేహానికి కోదండరాం నివాళులు
బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేద్దామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేద్దామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్‌ల సాధన కోసం ఆత్మహత్యకు చేసుకున్ సాయి ఈశ్వర్ చారికి టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం నివాళులు అర్పించారు. ఇవాళ జగద్గిరిగుట్టలో బీరప్ప నగర్‌లో ఇంటి వద్ద సాయి ఈశ్వర్ పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. అందరం కలిసి పోరాటం చేసి.. బీసీల రిజర్వేషన్‌లను సాదించాలని పిలుపునిచ్చారు. కానీ ఎవరూ కూడా చనిపోవద్దు అని, వారి కుటుంబానికి దుఃఖం మిగిల్చవద్దు అని అన్నారు.
సాయి ఈశ్వర్ చారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చే విధంగా, ప్రభుత్వం ఆదుకునే విధంగా కృషి చేస్తామని, ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు. సాయి ఈశ్వర్ కుటుంబ సమస్యను మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రొఫెసర్ కోదండరాంతో టీజేఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. నిజ్జన రమేష్ ముదిరాజ్, విద్యార్థి వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు మాసం పల్లి అరుణ్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు అశోక్ రెడ్డి, యూత్ విభాగం రాష్ట్ర నాయకులు, ఎర్ర వీరన్న, అనిల్ తదితరులు ఉన్నారు.






