- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tinmar Mallanna: తెలుగు తల్లి ఫ్లైఓవర్ ను తెలంగాణ తల్లిగా మార్చండి: తీన్మార్ మల్లన్న
తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును మార్చడంతో పాటు గన్ పార్క్ అమరవీరుల స్థూపం విషయంలో తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సెక్రటేరియట్ వద్ద ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ (Telugu Thalli Plyover) పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ (Telangana Thalli Plyover) గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Tinmar Mallanna) సూచన చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ జరుగుతున్న తరుణంలోనే ఈ పేరు మార్పు జరిగితే ఇంకా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం శాసనమండలిలో మాట్లాడిన ఆయన.. గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం పెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రారంభించలేదని ఈ ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించాలని కోరారు. తెలంగాణ మూలాలను కాపాడే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని అందులో భాగంగా ఈ అమరవీరుల స్థూపాన్ని ప్రారంభించాలన్నారు.
విగ్రహం స్వరూపం మారకుండా చూడాలి:
తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం (Telangana Mother Statue) అద్భుతంగా తెలంగాణ తల్లి పచ్చటి వస్త్రం చూస్తుంటే పంటపొలాల వద్ద గ్రామదేవతలు స్పురణకు వస్తున్నారని, తల్లికి ధరింప చేసిన గుండ్లను చూస్తే మా తల్లిని చూసినట్లుగా ఉందన్నారు. గతంలో తెలంగాణ తల్లి అని విగ్రహాలు పెట్టినా అవేవి కూడా మా తెలంగాణ తల్లులకు దగ్గరిపోలికలతో లేవన్నారు. ఇవాళ ప్రభుత్వం ప్రతిష్టించబోయే విగ్రహంలో తెలంగాణ అమ్మలు, బైరాన్ పల్లిలో పోరాడిన ఆడబిడ్డలు, మా చాకలి ఐలమ్మ కనిపిస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అంతరాత్మ అయిన ఈ విగ్రహ రూపం మార్చకుండా ఎప్పుడు ఇదే రూపం ఉండేలా చూడాలన్నారు. ఈ విగ్రహం కేవలం సచివాలయంలోనే కాకుండా అన్ని కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాలన్నారు.






