- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సనత్‌నగర్ టిమ్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం : మంత్రి దామోదర్ రాజనర్సింహ
సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. స్థానికులకే కాకుండా విదేశీయులకు సైతం వైద్య సేవలు అందించే స్థాయిలో ఈ హాస్పిటల్ ను తీర్చిదిద్దుతున్నామని ఆయన తెలిపారు. గురువారం సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ పనులను మంత్రి పర్యవేక్షించారు. ఆధునిక ఎక్విప్మెంట్, వైద్య సదుపాయాలు, ఇన్ఫ్రా, లాబరేటరీ, బ్లడ్ బ్యాంకులను మంత్రి పరిశీలించారు. ఆస్పత్రిలో చేపట్టిన సివిల్ వర్క్ లను శరవేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి ప్రాంగణంలో వైద్యులకు మేల్, ఫిమేల్ హాస్టల్ బ్లాక్స్ లను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే ఔట్ పేషంట్, ఇన్ పేషంట్లకు అవసరమైన టాయిలెట్ బ్లాక్స్ లను ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టం ను అభివృద్ధి చేయాలన్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగుల సహాయకుల కోసం ధర్మశాల, రెండు క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. పరిపాలన భవనం, టీబీ హాస్పిటల్ బోర్డు ఆఫీసు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆస్పత్రి ప్రధాన ద్వారంలో పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేయాలని తెలిపారు.
అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్న ఆసుపత్రిలో డ్రైనేజీ, శానిటేషన్ నిర్వహణ, వాటర్ సప్లై ఇలాంటి సేవలు నిరంతరం కొనసాగేనా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఆస్పత్రిలో అధునాతన ఇంటీరియర్, లాంజ్ లను ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రిలో విదేశీ రోగుల కోసం ఏర్పాటు చేసిన బ్లాక్స్ లో ఆధునిక సౌకర్యాలకు పెద్దపీట వేయాలని మంత్రి అధికారాలకు సూచించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ స్థాయి లేబరేటరీ ఏర్పాటుపై డీఎంఈ, హెచ్ఓడీ, టీజీఎంఎస్ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులతో కమిటీని మంత్రి ఏర్పాటు చేశారు. టిమ్స్ ఆస్పత్రి పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు అవసరమైన కొనసాగింపు పనులు పూర్తి చేసేందుకు అంచనాలను రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం, ప్రతిపాదిత పరిపాలన భవనంలో ఆస్పత్రి నిర్వహణ, మెరుగైన వైద్య సేవల కల్పన, సివిల్ వర్క్స్ ను శరవేగంగా పూర్తి చేయడంపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాలు, ఆస్పత్రి నిర్వహణ, మెరుగైన వైద్య సేవల కల్పన పై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి దిశా నిర్దేశనం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్ చొంగ్తు, డీఎంఈ డా. నరేంద్ర కుమార్, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హనుమంతు, నిమ్స్ డైరెక్టర్ డా. బీరప్ప, ఆర్ అండ్ బి శాఖ ఇంజనీరింగ్ అధికారులు రాజేశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.






