ఉగాదికి 'టిమ్స్' కష్టమే.. ఆవిర్భావ దినోత్సవం నాడే మోక్షమా?

by Naga Rani Yarlagadda |

సనత్ నగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఈ ఉగాదికి అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదు.పైకి మెరిసిపోతున్నా.. ఆస్పత్రి భవనం లోపలి పనులు మాత్రం పూర్తికాలేదని సమాచారం.

ఉగాదికి టిమ్స్ కష్టమే.. ఆవిర్భావ దినోత్సవం నాడే మోక్షమా?
X

దిశ తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సనత్‌నగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత్సవం ఉగాదికి అయ్యేలా కనిపించడం లేదు. ఉగాది పండుగ కానుకగా ఈ ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గతంలో ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. చివరి దశ పనులు ఇంకా కొనసాగుతుండటంతో, ఉగాది ముహూర్తం కాస్తా జూన్ 2కు మారే సూచనలు కనిపిస్తున్నాయి.

పనులు సకాలంలో పూర్తి చేయకే..

ఆస్పత్రి భవనం బయటకు రంగులతో మెరిసిపోతున్నా, లోపల మాత్రం పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ముఖ్యంగా అత్యంత కీలకమైన గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్లలో సివిల్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. పేషెంట్లకు ప్రాణాధారమైన ఆక్సిజన్ సప్లయ్ లైన్ల నిర్మాణం ఇంకా కొనసాగుతోంది. ఆక్సిజన్ ప్లాంట్ పనులు కూడా పూర్తి కాలేదు. కేవలం 40 శాతం వైద్య పరికరాలు మాత్రమే ఆస్పత్రికి చేరుకోగా, మిగిలిన 60 శాతం ఎక్విప్ మెంట్స్ ఎప్పుడు వస్తుందో అధికారులకే స్పష్టత లేదు.

డిప్యూటేషన్లతో నెట్టుకొస్తారా?

మరోవైపు ఆస్పత్రి నిర్వహణకు అవసరమైన భారీ సి బ్బంది కొరత వేధిస్తోంది. సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్‌ లకు కలిపి దాదాపు 4500 వరకు పోస్టుల భర్తీ కో సం పంపిన ప్రతిపాదనలు ఇంకా ఆర్థిక శాఖ వద్దే మూలుగుతున్నాయి. దీంతో గాంధీ, ఉస్మానియా వంటి ఆస్పత్రుల నుంచి డాక్టర్లు, నర్సులను డిప్యూటేషన్ మీద తెచ్చి ఆస్పత్రిని మమ అనిపించాలని సర్కార్ భావిస్తోందనే చర్చ వైద్య వర్గాల్లో నడుస్తోంది. అయితే, పూర్తిస్థాయి శాశ్వత సిబ్బంది లేకుండా సూపర్ స్పెషాలిటీ సేవలు ఎలా సాధ్యమని వైద్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కీలకమైన గాంధీ, ఉస్మానియా నుంచి వైద్యులు, సిబ్బందిని తరలిస్తే అక్కడ వైద్య సేవల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

జూన్ 2నే లక్ష్యం..

ప్రస్తుత జాప్యం చూస్తుంటే.. సనత్‌నగర్ టిమ్స్‌ తో పాటు అల్వాల్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ను కూడా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంద ర్భంగా ప్రారంభించేలా ప్రభుత్వం కొత్త ప్లాన్ సిద్ధం చేస్తు న్నట్లు సమాచారం. మరోవైపు పనుల ఆలస్యంపై ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సనత్ నగర్ టిమ్స్ ను ఎ ట్టి పరిస్థితుల్లో ఉగాదికి ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

Next Story