Official: తెలంగాణ కొత్త మంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

by Gantepaka Srikanth |

తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) సీనియర్ నేత, భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌(Azharuddin)కు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే.

Official: తెలంగాణ కొత్త మంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) సీనియర్ నేత, భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌(Azharuddin)కు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు రాజ్‌భవన్‌లో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రిక సిద్ధమైంది. ప్రస్తుతం ఈ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రేపు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ(Governor Jishtudev Verma) అజారుద్దీన్‌తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ దఫా విస్తరణలో కేవలం అజార్‌ను మాత్రమే కేబినెట్‌లోకి తీసుకోనున్నారు. రేవంత్ మంత్రివర్గంలో మైనార్టీలకు చోటులేదని విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. దీంతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టి మైనార్టీలను సంతృప్తి పరచడంతో పాటు హైదరాబాద్ జిల్లా నుంచి కేబినెట్‌లో ప్రాతినిధ్యం కల్పించాలని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే.

Next Story