- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరేపల్లి పరిసరాల్లో పులి కదలికలు.. థర్మల్ డ్రోన్‌లతో 24 గంటల నిఘా
సిద్దిపేట జిల్లాలోని ఆరేపల్లి గ్రామం పరిసరాల్లో సంచరిస్తున్న పులి కదలికలను తెలంగాణ అటవీ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: సిద్దిపేట జిల్లాలోని ఆరేపల్లి గ్రామం పరిసరాల్లో సంచరిస్తున్న పులి కదలికలను తెలంగాణ అటవీ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, పులికి కూడా హాని జరగకుండా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. పులి కదలికలను గమనించేందుకు థర్మల్ ఇమేజింగ్ డ్రోన్‌లను వినియోగంలోకి తీసుకుని 24 గంటల పాటు నిఘా ఏర్పాటు చేశారు. డ్రోన్‌ల ద్వారా రియల్ టైమ్‌లో సమాచారం అందుకుంటూ, అవసరమైన చోట వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
రంగంలోకి పుణే రెస్క్యూ బృందం..
మరోవైపు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తూ, అటవీ శాఖ సూచించిన జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని గ్రామస్తులకు సూచించారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకూడదని, పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. పరిస్థితిని సమర్థంగా నిర్వహించేందుకు పెట్రోలింగ్ బృందాలను రంగంలోకి దించడంతో పాటు, పుణే నుంచి వచ్చిన నిపుణుల రెస్క్యూ బృందం కూడా అప్రమత్తంగా ఉంది. పులి సహజంగా అటవీ ప్రాంతం వైపు వెళ్లేలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అటవీ శాఖ వెల్లడించింది.






