పచ్చిరొట్ట విత్తనాల సరఫరా

by velandi.Saikiran |

పచ్చిరొట్ట విత్తనాల సరఫరా కోసం తెలంగాణ సీడ్స్ కార్పోరేషన్ కు 90వేల క్వింటాళ్ళు, నేషనల్ సీడ్ కార్పోరేషన్ కు 40వేల క్వింట

పచ్చిరొట్ట విత్తనాల సరఫరా
X

తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ 90 వేల క్వింటాళ్లు

నేషనల్​ సీడ్స్​కార్పొరేషన్​40 వేల క్వింటాళ్లకు ఇండెంట్​: వ్యవసాయ శాఖ

దిశ, తెలంగాణ బ్యూరో : పచ్చిరొట్ట విత్తనాల సరఫరా కోసం తెలంగాణ సీడ్స్ కార్పోరేషన్ కు 90వేల క్వింటాళ్ళు, నేషనల్ సీడ్ కార్పోరేషన్ కు 40వేల క్వింటాళ్లకు ఇండెంట్ ఇవ్వడం జరిగిందని వ్యవసాయ శాఖ పేర్కొంది. 32 జిల్లాలలో 20 జిల్లాలు టిజి సీడ్స్ కు, 12 జిల్లాలు నేషనల్ సీడ్ కార్పోరేషన్ కు కేటాయించగా, తెలంగాణ సీడ్ కార్పోరేషన్ ఇప్పటివరకు 71,535 క్వింటాళ్లను తెప్పించి వారికి కేటాయించిన 20 జిల్లాలలో పంపిణీ ప్రారంభించిడం జరిగింది. నేషనల్ సీడ్ కార్పోరేషన్ వారికి కేటాయించిన 40 వేల క్వింటాళ్లలో ఇప్పటి వరకు కేవలం 1000 క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేయడంతో, ఆ సంస్థకు కేటాయించిన 12 జిల్లాలలో సరఫరాకు అడ్డంకులు రావడం జరిగింది.


ఈ విషయం మంత్రి తుమ్మల దృష్టికి రాగా టిజి సీడ్స్ ద్వారా మిగతా 12 జిల్లాలలో కూడా సరఫరా ప్రారంభించాలని, ఆ జిల్లా రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు టిజి సీడ్స్ సంస్థ ద్వారా మొదట కేటాయించిన 20 జిల్లాలతో పాటు నేషనల్ సీడ్ కార్పోరేషన్ కు సంబంధించిన 10 జిల్లాలలో కూడా వారి దగ్గర ఉన్న పచ్చిరొట్ట విత్తనాలను సరఫరా చేయడం ప్రారంభించారు. మరో వైపు ముందుగా అనుకున్న ఒప్పందం మేరకు సరఫరా ఆరంభించని నేషనల్ సీడ్ కార్పోరేషన్ వారి రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు ఢిల్లీ స్థాయిలో ఉన్న అధికారులను కలిసి పచ్చిరొట్ట విత్తనాల సరఫరాను వెంటనే ఆరంభించాల్సిందిగా కోరడం జరిగింది. టీజీ సీడ్స్ ద్వారా ఇంకా అదనంగా విత్తనాలను తెప్పించి ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రయత్నాలు ఆరంభించడం జరిగింది. రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని మంత్రి తుమ్మల సూచించారు.

Next Story