Thummala: కొత్తగూడెం ఎయిర్ పోర్టు, యూరియా కొరతపై కేంద్ర మంత్రులతో తుమ్మల భేటీ

by Prasad Jukanti |

కేంద్ర మంత్రులతో తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు.

Thummala: కొత్తగూడెం ఎయిర్ పోర్టు, యూరియా కొరతపై కేంద్ర మంత్రులతో తుమ్మల భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) ఇవాళ పౌరవిమానయాన శాఖ మంత్రి మంత్రులు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu), కేంద్ర ఎరువులు, రసాయన శాఖ మంత్రి అనుప్రియ పటేల్ తో (Anupriya Patel) భేటీ అయ్యారు. రామ్మోహన్ నాయుడితో సమావేశం సందర్భంగా కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుపై చర్చించారు. అనుప్రియ పటేల్ తో భేటీ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత సమస్యను వివరించారు. ఖరీఫ్ సీజన్ కు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా రాష్ట్రానికి అవసరమైన యూరియా ను సరఫరా చేస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ హామీ ఇచ్చారు.

Next Story