- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Thummala Nageshwara Rao : పసుపు బోర్డుపై ఎంపీ అరవింద్ కు తుమ్మల కౌంటర్
తెలంగాణలో పసుపు బోర్డు(Turmeric Board) ఏర్పాటుపై బీజేపీ, కాంగ్రెస్ పరస్పర కౌంటర్ వార్స్ నడుస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో పసుపు బోర్డు(Turmeric Board) ఏర్పాటుపై బీజేపీ, కాంగ్రెస్ పరస్పర కౌంటర్ వార్స్ నడుస్తున్నాయి. తాజాగా పసుపు బోర్డు ఏర్పాటుపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్(BJP MP Dharmapuri Aravind)కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala NageshwaraRao) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పసుపు బోర్డు ఏర్పాటుకు ఎలాంటి చొరవ చూపలేదని అరవింద్ అనడం హాస్యాస్పదం అన్నారు. బోర్డ్ ఏర్పాటుకు తాను కేంద్రానికి మూడుసార్లు రాసిన లేఖలను తుమ్మల విడుదల చేశారు. తానే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కూడా కేంద్రానికి లేఖ రాశరని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. అరవింద్ అజ్ఞానంతో మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. పసుపు బోర్డును ఆఘమేఘాల మీద అర్థరాత్రి ప్రకటించి తెల్లారి ప్రారంభించినా మేము తప్పు పట్టలేదని, మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాని ప్రతిదాన్ని రాజకీయం చేసే ఉద్దేశం లేదన్నారు. తాను 1983 నుండి నేటి వరకు నా రాజకీయ జీవితం తెరచిన పుస్తకమన్నారు. పదవుల కోసం, పార్టీ టికెట్ల కోసం ఏ నాడు, ఏ నాయకుడి వద్ద నేను మోకరిల్లింది లేదని, ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నది లేదన్నారు. 40 ఏళ్ల నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రతిక్షణం ప్రజాహితమే తప్ప వ్యక్తిగత స్వార్థం లేదని, ఇకపై ఉండబోన్నారు.
నాడు ఎన్టీఆర్ లాంటి మహానుభావుడి నుండి నేటి రేవంత్ రెడ్డి వరకు ఏ కేబినెట్ లో పని చేసినా, ఏ హోదాలో విధులు నిర్వర్తించినా రాష్ట్ర అభివృద్ధి, రైతులు సంక్షేమం, పేదల పక్షపాతం తప్ప నాకు మరో ఎజెండా లేదన్నారు. చంద్రబాబు కావచ్చు, కేసీఆర్ కావచ్చు రాజకీయంగా, సిద్ధాంత పరంగా నాతో విభేదించవచ్చు కానీ, ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల తన కమిట్ మెంట్ ను ప్రశ్నించలేదన్నారు. నాయకుడు ఎవరైనా, పార్టీ ఏదైనా ప్రజాహితమే నా అభిమతంగా పని చేశానని, తనను పార్టీలో చేర్చుకోవాలని, టికెట్ కావాలని, పదవి ఇవ్వాలని నా 40 ఏళ్ల ప్రయాణంలో ఏ నాడు, ఎవరిని అడిగింది లేదన్నారు. స్థాయి దిగజార్చుకుని మాట్లాడిన మాటలు సరైనవి కావని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు పర్యాయాలు లోక్ సభ సభ్యుడిగా ఎన్నికై ఇంతటి అధమ భాషను వాడటం సభ్యత అనిపించుకోదన్నారు. పరిపక్వతలేని మాటలు మాట్లడకుండా, కొద్దిగా సహనంతో, రాజకీయ పరిజ్ఙానంతో మాట్లాడితే బాగుంటుందని సూచించారు. కుతున్నాను. మీ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ వాటిని విజ్ఞతకే వదిలేస్తున్నానని వెల్లడించారు.






