- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్‌పై అమ్మాయిలను ఫాలో అవుతూ వేధింపులు..! నగరంలో రెచ్చిపోయిన ఆకతాయిలు
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. రోడ్లపై ప్రమాదకర స్టంట్స్ వేయడమే కాకుండా ఇతర వాహనాదారుల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. రద్దీ ప్రదేశాలు, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, షాపింగ్ మాల్స్, పర్యాటక ప్రదేశాలు, పండుగల సమయాల్లో మహిళలు కనిపిస్తే చాలు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. అలాంటి వారిని తెలంగాణ షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి చాలా మందిని అరెస్ట్ చేసి కౌన్సిలింగ్‌లు ఇస్తున్నారు. ఇటీవల బోనాల పండుగ సమయంలో ఎంతో మంది పోకిరీల అరెస్ట్‌లు, కౌన్సిలింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
పోకిరీల కట్టడికి చర్యలు తీసుకుంటున్నా కూడా ఆకతాయిల తీరు మాత్రం మారట్లేదు. తాజాగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ (Jubilee Hills) పరిధిలో అందరూ చూస్తుండగానే ఆకతాయిలు రెచ్చిపోయారు. ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కడమే కాకుండా.. బైక్‌పై అమ్మాయిలను ఫాలో అవుతూ వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేశారు. నెమలి ఈకలతో అమ్మాయిల వెనుక నుంచి తాకుతూ పోకిరీలు అసభ్యంగా ప్రవర్తించించారు. ఈ నేపథ్యంలోనే కారులో వెళ్తున్న వాళ్లు ఇది గమనించి వీడియో తీసుకుంటూ ఏం చేస్తున్నారని నిలదీయడంతో వెంటనే ఆకతాయిలు ఎస్కేప్ అయ్యారు.
వారు ఈ ఘటనను వీడియో తీసి నెట్టింట్లో పెట్టగా.. పోకిరీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇలాంటి పోకిరీల వల్లే నగర ప్రతిష్ట దెబ్బతింటోందని నెటిజన్లు మండిపడుతున్నారు. షీ టీములు పనిచేస్తున్నాయా? అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.






