రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. ముగ్గురు విద్యార్థులకు కరెంట్ షాక్

by Gantepaka Srikanth |

భారీ వర్షాల వేళ తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. ముగ్గురు విద్యార్థులకు కరెంట్ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాల వేళ తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ ప్రభుత్వ పాఠశాల(Mahadevpur Government School)లో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు(Independence Day Celebrations) ఏర్పాటు చేస్తు్న్న క్రమంలో విద్యార్థులు, ఒక అటెండర్‌కు కరెంట్ షాక్(Current Shock) తగిలింది. పాఠశాల పైనుంచి జెండాను కిందకు తీసుకొస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నలుగురూ సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని ఉపాధ్యాయులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story