ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-28 03:11:57  IST  )

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి(Sangareddy) జిల్లా నారాయణఖేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీదర్ హైవేపై అతివేగంగా వచ్చిన ఓ బైకు అదుపుతప్పి కల్వర్టు గుంతలో పడింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురూ మృతిచెందారు. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరో ఘటనలో విజయనగరం(Vizianagaram) జిల్లా గజపతినగరం రైల్వేస్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి కారు చెట్టును ఢీకొట్టింది. కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story