- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి
by GSrikanth |
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా కోయెలిబేడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు.

X
దిశ, భద్రాచలం: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా కోయెలిబేడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. నక్సల్స్ సమావేశం అయ్యారని సమాచారంతో పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా, పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పులలో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు కాంకేర్ ఎస్పీ కళ్యాణ్ ఎలిసేలా ప్రకటించారు. పారిపోయిన మావోయిస్టుల కోసం అదనపు బలగాలతో కూంబింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు.
Next Story






