లొంగిపోయిన ముగ్గురు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు.. తెలంగాణ డీజీపీ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivdhar Reddy) ఎదుట ముగ్గురు కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయారు.

లొంగిపోయిన ముగ్గురు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు.. తెలంగాణ డీజీపీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivdhar Reddy) ఎదుట ముగ్గురు కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయారు. వారికి సంబంధించిన వివరాలను డీజీపీ మీడియాకు వెల్లడించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన కుంకటి వెంకటయ్య అలియాస్‌ రమేశ్‌, తోడెం గంగ అలియాస్‌ సోనీ (ఛత్తీస్‌గఢ్‌), మొగిలచర్ల చందు అలియాస్‌ వెంకట్రాజు లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు. మావోయిస్టులు లోంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కోరారు. ఆపరేషన్ కగార్‌ ప్రారంభం నుంచి.. ఇప్పటివరకు అనేకమంది లొంగిపోయారని.. మిగిలిన వాళ్లు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పిలుపునిచ్చారు.

మరోవైపు.. మావోయిస్టులు ఆయుధాలు అప్పగించి సాయుధ పోరాటాన్ని వీడాలని, దీనిపై పార్టీ సభ్యులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఇటీవల మల్లోజుల వేణుగోపాల్ మీడియాకు బహిరంగ లేఖ రిలీజ్​చేసిన విషయం తెలిసిందే. దీనిపైనా డీజీపీ స్పందిస్తూ మల్లోజుల లొంగుబాటుకు సంబంధించిన సమాచారం తమకు ఇంకా చేరలేదని అన్నారు.

Next Story