తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు

by Gantepaka Srikanth |

భూదాన్ భూముల(Bhoodan Land) వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది.

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: భూదాన్ భూముల(Bhoodan Land) వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ముగ్గురు కీలక ఐపీఎస్ అధికారులు(IPS Officers) మంగళవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 27 మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని మొన్న సింగిల్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సింగిల్ బెంచ్ తీర్పుపై ముగ్గురు ఐపీఎస్ అధికారులు మహేశ్ భగవత్(Mahesh Bhagwat), స్వాతిలక్రా(Swati Lakra), సౌమ్యామిశ్రా(Soumya Mishra)లు హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. ఇదిలా ఉండగా.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారంలోని 181, 182 సర్వే నెంబర్‌లో సుమారు 103 ఎకరాల భూదాన్ భూమి ఉన్న విషయం తెలిసిందే.

అయితే ఈ భూమిపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఇందులో అక్రమాలు జరిగాయని ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా ప్రభుత్వంతోపాటు పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వారి భార్యలు, పిల్లలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. విచారణ అనంతరం ప్రభుత్వం, సీబీఐ, ఈడీతోపాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. అయితే తాజాగా ముగ్గురు ఐపీఎస్‌లు హైకోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈ అంశంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈడీ అధికారులు సైతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story