- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

- పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు
- అత్యధికంగా సిద్దిపేట్ జిల్లా జగదేవ్ పూర్ లో 8 సెం.మీ వర్షాపాతం నమోదు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Weather Department) తెలిపింది. బుధవారం భారీ వర్షాలు రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, పెద్దపల్లి, జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే బలమైన ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అన్ని జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని తెలిపింది.
మంగళవారం నమోదైన వర్షపాతం
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అన్ని జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం భారీగానే కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సిద్ధిపేట్ జిల్లా జగదేవ్ పూర్ లో 8 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం చంద్రుగొండలో 6 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో 6 సెం.మీ, సిద్దిపేట్ జిల్లా కవేరిలో 6 సెం.మీ, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 6 సెం.మీ, సంగారెడ్డి జిల్లా జోగిపేట్ లో 5 సెం.మీ, సిద్దిపేట్ జిల్లా వర్గల్ లో 5 సెం.మీ, సంగారెడ్డి జిల్లా హత్నూర్ లో 5 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు 5 సెం.మీ, జనగాం జిల్లా బచ్చన్న పేట్ లో 5 సెం.మీ, జనగాం జిల్లా జనగాంలో 5 సెం.మీ, మెదక్ జిల్లా బసంత్ పురలో 5 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.






