- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడు రోజులు తెలంగాణకు భారీ వర్షసూచన..ఈ జిల్లాలో కుండపోత వానలు
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో ఈ ఏడాది భారీ వర్షాపాతం నమోదవుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో ఈ ఏడాది భారీ వర్షాపాతం నమోదవుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. కాగా తాజాగా నేటి నుండి మూడు రోజుల పాటూ తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని పేర్కొంది.
ఇవాళ తీరం దాటే అవకాశం ఉండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేడు ములుగు, భూపాల్ పల్లి జిల్లా, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేడు అన్ని జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటిచింది.






