ఏ క్షణంలోనైనా పేల్చేస్తామంటూ మలేషియా విమానానికి బెదిరింపులు

by Malleboina Mahesh |

మలేషియా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు రావడంతో శంషాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేసి తనిఖీలు చేపట్టారు.

ఏ క్షణంలోనైనా పేల్చేస్తామంటూ మలేషియా విమానానికి బెదిరింపులు
X

దిశ, వెబ్ డెస్క్: మలేషియా నుంచి వస్తున్న అంతర్జాతీయ విమానానికి (International flight) బాంబు బెదిరింపులు రావడం శంషాబాద్ విమానాశ్రయంలో తీవ్ర కలకలం రేపింది. విమానాన్ని ఏ క్షణంలోనైనా పేల్చేస్తామంటూ గుర్తుతెలియని దుండగులు బెదిరించడంతో పైలట్లు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులను అప్రమత్తం చేశారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) సెక్యూరిటీ సిబ్బంద, బాంబు స్క్వాడ్ రెస్పాన్స్ టీమ్స్ వెంటనే రంగంలోకి దిగి హై అలర్ట్ ప్రకటించాయి.

తీవ్ర ఉత్కంఠ నడుమ ఎయిర్‌పోర్ట్ అధికారులు (Airport authorities) అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టడంతో విమానం శంషాబాద్ రన్‌వేపై క్షేమంగా ల్యాండ్ (Safe Landing) అయింది. ల్యాండింగ్ పూర్తి కాగానే అత్యవసర నిబంధనల ప్రకారం విమానాన్ని రన్‌వే నుంచి హుటాహుటిన ప్రత్యేక ఐసోలేషన్ బే (Isolation Bay)కు తరలించారు. భద్రతా సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించి, విమానం తో పాటు వారి లగేజీని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ ఘటనతో ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో కాసేపు భయాందోళన వాతావరణం నెలకొంది.

Next Story