- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Meenakshi Natarajan : పార్టీ కోసం కష్టపడే వారికి తప్పకుండా పదవులు : మీనాక్షి నటరాజన్
ఏఐసీసీ(AICC) ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్(Meenakshi Natarajan) తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకు శుభవార్త చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్ : ఏఐసీసీ(AICC) ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్(Meenakshi Natarajan) తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకు శుభవార్త చెప్పారు. పార్టీ కోసం కష్టపడే వారికి తప్పకుండా వివిధ కమిటీలలో, రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీని గ్రామ, మండల, జిల్లా స్థాయిలో బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నామని మీనాక్షీ తెలియజేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పేర్కొన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో(Local Body Election) పంచాయతీ సంఘటన్ కీలక పాత్ర పోషించాలని సూచించారు.
పార్టీలో అంతర్గత విభేదాలు, కొత్త నాయకులతో సమన్వయ లోపాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ప్రతి జిల్లాకు ఇద్దరు అబ్జర్వర్‌లను నియమించి కమిటీలలో నిబద్ధత కలిగిన కార్యకర్తలను గుర్తించాలని సూచించారు. 42% బీసీ కోటా, ఎస్సీ వర్గీకరణ, కుల గణన వంటి ప్రభుత్వ విజయాలను ప్రజలకు చేరవేయాలని, బీజేపీ, బీఆర్ఎస్ అసత్య ప్రచారాలను ఎదుర్కోవాలని కార్యకర్తలకు మీనాక్షీ పిలుపునిచ్చారు.






