పిచ్చి మాటలు మాట్లాడే వాళ్లకు గుణపాఠం తప్పుదు.. ఈటల మాస్ వార్నింగ్

by Kema Shiva Kumar |

నేషనల్ హెరాల్డ్ (National Herald ) కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ (ED) ఛార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ.. గురువారం టీపీసీసీ (TPCC) ఆధ్వర్యంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టాయి.

పిచ్చి మాటలు మాట్లాడే వాళ్లకు గుణపాఠం తప్పుదు.. ఈటల మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ హెరాల్డ్ (National Herald ) కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ (ED) ఛార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ.. గురువారం టీపీసీసీ (TPCC) ఆధ్వర్యంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. అయితే ఆ కార్యక్రమంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav) మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)ని నోటితో పలుకలేని విధంగా దుర్భషలాడారు. అయితే, అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో చక్కర్లు కొడుతోంది.

ఈ క్రమంలోనే కిషన్‌రెడ్డిపై కాంగ్రెస్ నేతలు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఇవాళ హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై నాంపల్లి (Nampally) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి నోటికొచ్చినట్లుగా మాట్లాడటం సరికాదని అన్నారు. చేతకానివారే ఏది పడితే అది మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషల్ హెరాల్డ్ కేసు ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందేమి కాదని.. చట్టాన్ని గౌరవించకుండా హస్త పార్టీ నేతలు ఆందోళనలు చేయడం సిగ్గుచేటని హితవు పలికారు. కాంగ్రెస్ నేతలు సంస్కారహీనంగా మాట్లాడారని.. పిచ్చి మాటలు మాట్లాడే నేతలకు గుణపాఠం తప్పదని ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు.

Next Story