బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులే సుప్రీం కోర్టును ఆశ్రయించారు: మంత్రి పొన్నం

by Malleboina Mahesh |   (  Updated:2025-10-06 05:04:37  IST  )

బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో మంత్రి పొన్న ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులే సుప్రీం కోర్టును ఆశ్రయించారు: మంత్రి పొన్నం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల స్థానిక సంస్థల్లో తెలంగాణ ఓబీసీ కోటాను 42%కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను నేడు విచారించనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వే తర్వాత, తాము క్యాబినెట్ ఆమోదం పొంది, దానిని సభలో ప్రవేశపెట్టాము. ఆపై బీసీ బిల్లును రూపొందించి.. దానిని దానిని చట్టంగా రూపొందించి గవర్నర్‌కు పంపాము. గవర్నర్ దానిని రాష్ట్రపతికి పంపారు.

రాష్ట్రపతి వద్దకు బీసీ బిల్లు వెళ్లి.. నాలుగైదు నెలలు అయింది. మేము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కుల సర్వే నిర్వహించాము. అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ఏకగ్రీవంగా దీనిని ఆమోదించాయి. దీనిని ఆపాలని కొంతమంది వ్యక్తులు హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టులో విచారణ జరిగింది. 8వ తేదీకి వాయిదా పడింది. కేసు అక్కడే ఉండగా, కొందరు సుప్రీంకోర్టు తలుపులు తట్టి బీసీ బిల్లుకు వ్యతిరేకంగా పని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టులో మాకు న్యాయం జరుగుతుంది. తెలంగాణలో 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు జరుగుతాయని మేము ఆశిస్తున్నాము..." అని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Read More: బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో పోరాడుతాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Next Story