ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కార్ వైఫల్యమే.. బండి సంజయ్ సంచలన ట్వీట్

by Kema Shiva Kumar |

ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఆందోళన బాటపట్టిన విషయం తెలిసిందే.

ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కార్ వైఫల్యమే.. బండి సంజయ్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఆందోళన బాటపట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 15 నుంచి కాలేజీల నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థుల సమస్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ (BRS), కాంగ్రెస్ (Congress) పార్టీలు యువతను నిలువునా మోసం చేశాయని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించక ప్రైవేటు కళాశాలలు మూతపడే దుస్థితి వచ్చాయని బండి సంజయ్ అన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో విద్యార్థులు తమ సర్టిఫికెట్లను కళాశాలల నుంచి తీసుకోలేకపోతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఇక యాజమాన్యాలు, సిబ్బంది జీతాలు లేక ఆవస్థలు పడుతున్నారని.. తాము నమ్ముకున్న సంస్థలు కళ్లెదుటే కూలిపోతున్నాయని అన్నారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కార్ పాలనా వైఫల్యమేనని తెలిపారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలు కనీసం గ్రూప్-1 పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించలేకపోయారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలను కోల్పోతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేటు కళాశాలల సమస్యలు పరిష్కరిచాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు క్లియర్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Next Story