- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్, హరీశ్ రావు మధ్య గొడవ!.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
అక్రమ భూములకు సంబంధించిన కేసులో నుంచి తన తమ్ముడిని కాపాడాలని చేసిన విజ్ఞప్తిని కాదన్నారనే పొంగులేటిని హరీశ్ రావు టార్గెట్ చేశారని సీఎం ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీజేపీ నేతలకు సూచనలు ఇచ్చి పారిపోవడం అలవాటుగా మారిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని, కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందని ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చి పదే పదే చెప్పారని అన్నారు. కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతామని కేంద్ర మంత్రి హోదాలో స్వయంగా కిషన్ రెడ్డి చెబితే బీజేపీ మాటలు నమ్మి సీబీఐ విచారణకు ఇస్తే ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆదివారం శాసన సభలో రాఘవ కన్ స్ట్రక్షన్ అంశంపై సభలో గందరగోళం ఏర్పడింది. ఈ కంపెనీ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని, మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ సభ్యులు వెల్ లోకి దూసుకు వెళ్లి నినాదాలు చేసింది. ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి మాట్లాడుతూ సభా సమయం వృథా అవుతోందని అందువల్ల హౌస్ కమిటీ వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ ఏదో చేస్తుందని నమ్మి ఇదే శాసనసభ వేదికగా కాళేశ్వరం కుంభకోణంపై విచారణను సీబీఐకి అప్పగిస్తే 48 గంటలు కాదు కదా నెలలు గడుస్తున్నా చర్యలు లేవన్నారు. కాళేశ్వరం కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‍రావును జైల్లో పెట్టిన తరువాత బీజేపీ నేతలు సూచనలు చేస్తే బాగుంటుందన్నారు. బీఆర్ఎస్ , బీజేపీ రెండు ఒక్కటేనని, పార్లమెంట్, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కలిసే పోటీ చేసి సీట్లు, ఓట్లు పంచుకున్నాయని ధ్వజమెత్తారు.
హరీశ్ తమ్ముడి విషయంలో నో చెప్పడంతో కక్ష:
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్‍లో ఓ ప్రైవేటు పరిశ్రమ యజమానులను బెదిరించి హరీశ్ రావు తమ్ముడు మహేశ్ రావు, ఆయన మామ హనుమంతరావు ధరణిని అడ్డం పెట్టుకుని వందల ఎకరాలు అక్రమంగా భూ బదలాయింపు చేసుకున్నారని సీఎం ఆరోపించారు. ఈ విషయంలో నేను నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నాను. ఈ అక్రమాలపై హౌస్ కమిటీ వేయడానికి మేం సిద్ధంగా ఉన్నామని, హరీశ్ రావుకు దమ్ము, ధైర్యం ఉంటే ఇందుకు మీరు సిద్ధమో కాదో చెప్పాలన్నారు. బాలానగర్ భూముల విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ నుంచి రిపోర్టు అడిగారని దాంతో ఇందులో స్వయంగా మా సోదరుడు, మా మామ ఉన్నారని ఈ కేసులో సహకరించాలని మంత్రి పొంగులేటికి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారని చెప్పారు. ఇందుకు మంత్రి కుదరదనడంతో అప్పటి నుంచి పొంగులేటిని హరీశ్ రావు టార్గెట్ చేస్తున్నారని సీఎం ఆరోపించారు.
హరీశ్ రావు, కేటీఆర్ మధ్య గొడవ:
నిన్న సభలో మైనింగ్ అక్రమాలపై చర్చకు అవకాశం ఇచ్చామని సీఎ చెప్పారు. చర్చ అనంతరమే 2024 జూన్ 2 నుంచి రాఘవ కన్ స్ట్రక్షన్ వరకు సీబీ సీఐడీ విచారణకు ఆదేశామన్నారు. సీఐడీ విచారణ ఆదేశాలతో హరీశ్ రావు, కేటీఆర్, సంతోశ్ రావు గొడవ పడ్డారని అన్నారని హరీశ్ రావును కేటీఆర్ బండబూతులు తిట్టారని సీఎం ఆరోపించారు. నీ వల్ల నా మెడకు ఉరి పడేలా ఉందని హరీశ్ రావుపై కేటీఆర్ అన్నారని ఆరోపించారు. హరీశ్ రావు, కేటీఆర్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైందన్నారు. హరీష్ రావు నిజాయితీపరుడని కేటీఆర్, వెంకటరమణా రెడ్డి నమ్మితే హౌస్ కమిటీ వేయడానికి ఒప్పుకోవాలన్నారు.






