- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kavitha Issue: ఇది తండ్రి కూతురు పంచాయితీ కాదు ..కవిత విషయంలో దాసోజు శ్రవణ్
కవిత సస్పెన్షన్ విషయంలో బీఆర్ఎస్ లో దుమారం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీ కవితను (Kavitha) బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (Dasoju Shravan) కవిత ఇష్యూపై స్పందించారు. గత కొంత కాలంగా కవిత వ్యవహార శైలి కేసీఆర్ ఇమేజ్, పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని అన్నారు. ఈ రకంగా వేరే ఇతర ఎవరైనా వ్యవహరిస్తే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ తెలంగాణ ఉద్యమంలో కవిత పాత్ర, ఆమెపై ఏదైనా ఒత్తిడి ఉందా అనే ఆలోచనతో పార్టీ ఇన్నాళ్లు ఆమెపై వేటు వేయకుండా వేచి చూసిందన్నారు. అయినా తప్పు మీద తప్పు అన్నట్లు పార్టీకి నిరంతర సైనికుడు హరీశ్ రావుపై కవిత దుర్మార్గంగా వ్యవహరించారని విమర్శించారు. మొదట్లో కేటీఆర్ ను టార్గెట్ చేసిన కవిత ఇప్పుడు హరీశ్ రావు, సంతోష్ రావు ను టార్గెట్ చేస్తోందన్నారు. కవిత దాడి నేరుగా కేసీఆర్ పైనే ఉందని ఇది తండ్రి కూతురు పంచాయితీ కాదన్నారు. కేసీఆర్ కవితకు ఎలాగు తండ్రో పార్టీలో ఉన్నారందరికీ ఆయన తండ్రిలాంటివారన్నారు. కేసీఆర్ నాలుగున్నర కోట్ల మంది ప్రజలకు ఆరాధ్య ధైవం లాంటి వారని, 60 లక్షల మంది సభ్యులు ఉన్న పార్టీకి అధినేత అన్నారు. ఓ వైపు కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని సభలో రేవంత్ రెడ్డి చెబుతుంటే మరో వైపు ఆ వాదనకు బలం ఇచ్చేలా హరీశ్ రావు కాళేశ్వరంలో అవినీతికి పాల్పడ్డారని వ్యాఖ్యలు చేయడం వల్ల ఆమె మాటల వెనుక మర్మం చిన్న పిల్లలకు సైతం అర్థం అవుతుందన్నారు.






