- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది నిజంగా గర్వించదగిన రోజు.. మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఒక చిన్న ఇంక్యుబేషన్‌గా మొదలై.. భారతదేశంలోని స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో అగ్రగామిగా టీ-హబ్ ఎదగడం నిజంగా ఇవాళ గర్వించదగిన రోజని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఒక చిన్న ఇంక్యుబేషన్‌గా మొదలై.. భారతదేశంలోని స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో అగ్రగామిగా టీ-హబ్ ఎదగడం నిజంగా ఇవాళ గర్వించదగిన రోజని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ టీ-హబ్ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ దూరదృష్టి నాయకత్వంలో తాము ఓ సమగ్రమైన ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను నిర్మించామని అన్నారు. నేడు అదే ఇవాళ హైదరాబాద్‌ను భారతదేశపు స్టార్టప్ రాజధానిగా మార్చిందని కేటీఆర్ అన్నారు.
ఒక సమగ్రమైన ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేసే లక్ష్యంతో తాము చేపట్టిన విజన్‌లో టీ-హబ్ కేవలం మొదటి అడుగు మాత్రమేనని కేటీఆర్ తెలిపారు. ఆ తర్వాత వీ-హబ్ (We-Hub), తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (TSIC), టీ-వర్క్స్ (T-Works), తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK), ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (RICH) వంటి సంస్థలను ఏర్పాటు చేశామని అన్నారు. ఇవన్నీ తెలంగాణ ఇన్నోవేషన్ వ్యవస్థను సాటి లేనిదిగా తయారు చేశాయన్నాయని కొనియాడారు.
టీ-హబ్ ఏర్పాటు రోజున రతన్ టాటా టీ-హబ్ ఆధునిక భారతదేశ ముఖచిత్రంగా నిలుస్తుందని చెప్పిన మాటలను గుర్తు చేశారు. ఒక విశాలమైన, విస్తృతమైన విజన్ పునాదిగా... ఒక చిన్న ఇంక్యుబేటర్‌గా ప్రారంభమై టీ-హబ్ ఈ స్థాయికి చేరడం గర్వంగా ఉందన్నారు. గత దశాబ్దంలో టీ-హబ్ సాధించిన విజయం ఐటీ మంత్రిగా తనకు అత్యంత సంతృప్తనిచ్చిన క్షణాల్లో ఒకటిని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అనేక ఆవిష్కరణలను నడిపిస్తూ.. వందలాది టెక్ స్టార్టప్‌లు వాటి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి స్ఫూర్తిని, బలాన్ని ఇస్తున్న టీ-హబ్ ప్రస్థానాన్ని అభినందిస్తున్నట్లుగా కేటీఆర్ తెలిపారు.
READ MORE .....






