- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hidma: హిడ్మా ఎన్ కౌంటర్ బూటకం: కూనంనేని సాంబశివరావు
కేంద్ర ప్రభుత్వ విధానాలు జంగిల్ రాజ్ పాలనకు మావోయిస్టుల ఎన్ కౌంటర్లు పరాకాష్ట అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టు అగ్రనేత హిడ్మా (Hidma) ఎన్‍కౌంటర్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరరావు (Koonanneni Sambasiva Rao) స్పందించారు. మావోయిస్టులను చంపుకుంటూ పోవడమంటే మానవ హననం తప్ప మరొకటి కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు జంగిల్ రాజ్ పరిపాలనకు ఇది పరాకాష్ట అని విమర్శించారు. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. కేంద్ర ప్రభుత్వ జంగిల్ రాజ్ పరిపాలనలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు కూడా పావులుగా మారారని ధ్వజమెత్తారు. ఇవాళ మారేడుమిల్లిలో జరిగిన హిడ్మా ఎన్‌కౌంటర్‌తో పాటు గతంలో మావోయిస్టులపై జరిగినవన్నీ ఫేక్ ఎన్‌కౌంటర్స్ అని ఆరోపించారు. బూటకపు ఎన్ కౌంటర్స్‌తో మనుషులను చంపుకునే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదని, మావోయిస్టులు ఏదైన నేరాలు చేసివుంటే వారిని అరెస్టు చేసి చట్టభద్దంగా విచారణ జరిపించాలని ఇలాంటి ఫేక్ ఎన్‌కౌంటర్‌లు చేయడం విచారణకరమని అన్నారు. మావోయిస్టులపై జరుగుతున్న ఎన్‌కౌంటర్లపై విచారణ జరిపించాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.






