మహనీయుల త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర్యం: బండ ప్రకాష్

by Bhoopathi Nagaiah |

మహనీయుల త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర్య దినోత్సవమని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు.

మహనీయుల త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర్యం: బండ ప్రకాష్
X

దిశ, ఆసిఫాబాద్: మహనీయుల త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర్య దినోత్సవమని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ నిర్వహించిన 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తొందన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అంతకు ముందు జాతీయ జెండాను ఆవిష్కరించి.. ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అలాగే జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కాంతిలాల్ పాటిల్, డీఎస్వో కార్యాలయంలో డీఎస్వో నీరజ్ కుమార్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి వేర్వేరుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. కలెక్టర్, జిల్లా ఎస్పీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

Next Story